జర్నలిస్టులందరూ నాకు ఎంతో అండదండగా నిలిచి సహాయం చేశారని మీ అందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చే వరకు విశ్రమించనని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు .జర్నలిస్ట్ డే సందర్భంగా శనివారం పాల్వంచలోని ప్రెస్ క్లబ్ లో కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జర్నలిస్ట్ వేడుకలు జరిగాయి .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కేక్ కట్ చేసి జర్నలిస్టులందరినీ శాలువాలతో సత్కరించారు .జర్నలిస్టులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయించాలని జర్నలిస్టులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు .