మాజీ ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు లపై అన్న మాటల్లో తప్పేముందని వైసీపీ నాయకులు ప్రశ్నించారు. కళ్యాణదుర్గంలోని వైసీపీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 1: 30 గంటల సమయంలో విలేకరులతో మాట్లాడారు.ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు బిక్కీ హరి,మండల కన్వీనర్ హనుమంతరాయుడు మాట్లాడారు.కుప్పంకు నీళ్లు తీసుకొని వెళ్లారు. కుందుర్పి కి ఎందుకు తీసుకొని రాలేదని రంగయ్య ప్రశ్నించారన్నారు. అంతమాత్రాన రంగయ్యను ఏ ఊర్లో అడుగుపెట్టనీయమని టీడీపీ నాయకులు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఏ ఊర్లో అయినా అడుగు పెడతాం దమ్ముంటే ఆపుకోండి అంటూ చాలెంజ్ విసిరారు.