ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం మధ్యాహ్నం ఆశ వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాత శిశు మరణాలు తగ్గాయి అంటే ఆశ వర్కర్ల వల్లేనని గుర్తు చేశారు. ప్రజల్లో ప్రభుత్వ హాస్పిటల్ లపై నమ్మకం కలిగిందంటే ఆశ వర్కర్ల నిరంతర కృషేనని తెలిపారు. గత 23 సంవత్సరాలుగా ఆశ వర్కర్లుగా పని చేస్తున్నామని, ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.