జిల్లా విద్యా అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మంగళవారం జారీ చేసింది.ఈ ఉత్తర్వుల ప్రకారం జిల్లా విద్యా విభాగానికి సంబంధించిన పరిపాలనా, పర్యవేక్షణా కార్యక్రమాలు, పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదల, ఉపాధ్యాయుల పర్యవేక్షణ వంటి అంశాలను ఆమె సమన్వయం చేయనున్నారు.