చింతలమ్మ నేపల్లి మండలంలోని బాబాసాగర్ గ్రామంలోని ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బాబాసాగర్ గ్రామానికి చెందిన వెంకటేష్ సంతోష్లకు తీవ్ర గాయాలు కాగా సంతోష్కు కాలు విరిగినట్లు స్థానికులు తెలియజేశారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లోని ఆసుపత్రికి సంతోషను తరలించినట్లు స్థానికులు తెలిపారు. ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు,