ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుప్టి వద్ద జాతీయ రహదారిపై ఆయిల్ డ్రమ్ములను సరఫరా చేస్తున్న లారీ బోల్తా పడింది. దీంతో జాతీయ రహదారిపై ఆయిల్ డ్రమ్ములు పడిపోవడంతో రహదారిపై ఆయిల్ పూర్తిగా వ్యాపించాయి. దింతో జాతీయ రహదారిపై ఒక వైపు రాకపోకలు నిలిచి పోయాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మరో వైపు నుంచి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. కాగా ఘటనలో డ్రైవర్ క్లినర్ లకు గాయాలయ్యాయి.