వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని శుక్రవారం పరిగి శాసనసభ్యులు డా.రామ్మోహన్ రెడ్డి శుక్రవారం ప్రసిద్ధ శ్రీపార్వతి రాజరాజేశ్వరస్వామివారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.తరువాత ఆలయం కల్యాణ మండపంలో వేద పండితులు మరియు ఆలయ అర్చకులు వీరిని శేషవస్త్రంతో సత్కరించి,లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీస్సులు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ నూగురి నరేందర్,అధికారులు ఉన్నారు.