ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామ శివారులో అక్రమంగా డీసీఎం లో కలప నేడు శనివారం రోజున అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న 20 టేకు దుంగల విలువ సుమారు 1,50,000 ఉంటుందని అంచనా వేశారు. అక్రమంగా ఎవరైనా కలప రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.