కరెంట్ అందేనా..? కాలం అయ్యేనా..! వానాకాలం వరి పంటలు చేతికందేలా లేవని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజాంసాగర్ పెద్ద పూల్ బ్రిడ్జి కింద మంజీర నదికి ఇరువైపులా వందల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఇటీవల వచ్చిన వరదల్లో నది వెంట ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లన్నీ ధ్వంసమయ్యాయి.నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్న విద్యుత్ మరమ్మత్తు పనులు సాగడం లేదు. విద్యుత్ అధికారులు స్పందించి మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు.