కోళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన ఆదివారం జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది,శివారు ప్రాంతంలో కొద్ది రోజులుగా కోళ్లు దొంగతనానికి గురి అవుతున్నాయి,శివారు ప్రాంతంలోని రైతులు ఇళ్లకు తాళాలు వేసుకొని పనుల నిమిత్తం వెళ్లిపోవడంతో ముగ్గురు వ్యక్తులు ఓ ఇంటి వద్ద కోళ్ల దొంగతనానికి పాల్పడం సీసీ కెమెరాలో రికార్డు అయింది, ఈ క్రమంలో సూరంపేట రోడ్డులో గల ఓ వ్యక్తి ఇంటి వద్ద కోళ్ల దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పినట్లు ఎస్సై సందీప్ 7:50 pm కి వెల్లడించారు,