వీరవాసరంలో శ్రీనివాస ట్రేడర్స్, సాయి లక్ష్మి ఫెర్టిలైజర్స్, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు సంబంధించిన గోడౌన్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా నిల్వలను సంబంధించిన స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎరువులు కొరత లేదు సరిపడనంత నిల్వలు సొసైటీలో అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. రైతులతో మాట్లాడారు రైతులు ఎవరు ఆందోళన చందవద్దని పిఏసిఎస్ లలో అవసరమైన యూరియా అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. గత సార్వ పంటలో ఎంత యూరియా అయితే అవసరమైనదో ప్రస్తుతం కూడా అంతే నిల్వలు ఉంచడం జరిగిందని అన్నారు.