సిరికొండ మండలం కొండూరు గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ సిరికొండ మండల శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం GST తగ్గించిందని తెలిపారు.ఈ నిర్ణయంతో నిత్యవసర వస్తువులు, నోట్‌బుక్స్, ఆటోమొబైల్ రంగం, ఇన్సూరెన్స్ రంగం, అలాగే 33 రకాల మందులపై జీరో GST విధించడంతో ప్రజలకు గొప్ప ఉపశమనం కలిగిందని అన్నారు.