కనిగిరి పట్టణంలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి నియోజకవర్గంలోని 6 మండలాల వ్యవసాయ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు అవసరమయ్యే ఎరువులు, పురుగుమందుల విషయంలో ఎక్కడ కొరత లేకుండా సరిపడినంత స్టాకును అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి ప్రస్తుతం రైతులు సాగు చేసుకుంటున్న పంటలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ ఏడిఏ జైనులాబ్దిన్ పాల్గొన్నారు.