పటాన్ చెరు మరోమారు రాష్ట్రస్థాయి క్రీడలకు కేంద్రంగా నిలవబోతోంది. అక్టోబర్ 16, 17, 18 తేదీలలో 69వ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) రాష్ట్రస్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలు జరగనున్నాయని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు పటాన్ చెరులో నిర్వహించేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరగా లభించిందన్నారు.