గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, కరీంనగర్ జిల్లా,రామడుగు మండలం,కిష్టాపూర్ స్టేజి వద్ద అధిక నీటి ప్రవాహం వల్ల రోడ్డు గురువారం కోతకు గురైoది అలాగే వెదిర గ్రామంలోని రైల్వే ట్రాక్ భారీ వర్షం కారణంగా మునిగిపోయింది,దీంతో 6:20 PM కి నిజామాబాద్ వెళ్లవలసిన రైలు అక్కడే నిలిచిపోయింది, రామడుగు SI రాజు పోలీస్ స్టేషన్ సిబ్బంది కోతకు గురైన రోడ్డు వద్దకు నీటమురిగిన రైల్వే ట్రాక్ వద్దకి సిబ్బందితో వెళ్లి సంబంధిత శాఖల అధికారులకు సమాచారం చేరవేశారు,రైలు నిలిచిపోవడంతో రైల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, అధికారులు ట్రాక్ ను పునరుద్ధరించడంతో రైళ్ల రాకపోకలు ఆలస్యంగా కొనసాగాయి,