ఈరోజు అనగా 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయం నందు అశ్వాపురం మండలంలోని సివిల్ సప్లై డీలర్లతో అశ్వాపురం తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ మణిధర్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ ప్రజలందరికీ అందేలా చూడాలని షాపులు సమయపాలన పాటించాలని ప్రతి నెల మొదటి తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ ఇవ్వాలని డీలర్లు ప్రజలతో సంయుక్యతంగా ఉండాలని బియ్యం నిల్వలో రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరిగితే సహించేది లేదని అన్నారు