సంగారెడ్డి కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా వైద్య ఆరోగ్యశాఖ మహిళా ఉద్యోగులు పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల సౌందర్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడిన బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో పెద్ద పండుగని మహిళ ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.