విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించి మంచి భవిష్యత్తును రూపొందించడంలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా పని చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సమీకృత కలెక్టరేట్లో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడంలో ఉపాధ్యాయుడి పాత్ర కీలకమైనదని తెలిపారు. అనంతరం రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సన్మానించి, జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన 71 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు.