గుంటూరు జిల్లా మంగళగిరిలోని టిడ్కో కాలనీలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులతో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ భరోసాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం 2,56,904 మంది పింఛన్ దారులకు లో 111.34 కోట్లు పంపిణీ జరుగుతుందని తెలిపారు.