వేసవి ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వడదెబ్బపై ప్రతి ఒక్కరు అవగాహన పరుచుకోవలసిన అవసరం ఉందని జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెచ్ఎస్యూ చిన్న రాజులు తెలిపారు. మంగళవారం జలుమూరు మండలం తిలారు రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వడదెబ్బపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నంతవరకు నీటిని దగ్గర ఉంచుకోవాలని, కొబ్బరినీళ్లు తీసుకుంటూ, ఓఆర్ఎస్ కూడా వినియోగించాలని కోరారు.