జిల్లాలోని రైతులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష ఆధ్వర్యంలో కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కోటిరెడ్డి సర్కిల్ ఏడు రోడ్లమీదగా ఆర్డీవో ఆఫీస్ ములుగు సాగింది. అనంతరం ఏవో శంకరయ్యకు వారు వినతి పత్రాన్ని అందజేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.