ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించే ఫిర్యాదులు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదుల పై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ గారు "ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం"(PGRS) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలు మూలల నుండి వచ్చిన 113 మంది ఫిర్యాదారులతో జిల్లా ఎస్పీ గారు ముఖాముఖి మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి వివరంగా అడిగి తెలుసుకుని ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ చేయాలన్నారు.