దేవీపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం గోదావరి వరద నీటిలోనే ఉందని దేవస్థాన అధికారులు గురువారం తెలిపారు. భద్రాచలం ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా రావడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగాయని వెల్లడించారు. భక్తులు ఎవరు అమ్మవారి దర్శనానికి రావొద్దని, ఆలయానికి వచ్చే రహదారి నీట మునిగి ఉందని పేర్కొన్నారు.