తెలంగాణ బచావో మూమెంట్ అధ్యక్షుడు పిడమర్తి రవి గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బుద్ధ భవనంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో మార్వాడీలు కొత్త దుకాణాలు పెట్టరాదని హెచ్చరించారు. తెలంగాణలో వ్యాపారం చేయడానికి వచ్చి తమపైనే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, దాడులకు ప్రతి దాడులు ఉంటాయని స్పష్టం చేశారు.