మధ్యాహ్న భోజన పథకం (MDM) కార్మికులకు ప్రతీ నెలా బిల్లులు చెల్లించాలని లేని పక్షంలో తాము సమ్మెకు సిద్ధమని MDM రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపునూరి చక్రపాణి స్పష్టం చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లాకు కేంద్రంలో నిర్వహించిన MDMకార్మికుల జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు ప్రతినెల బిల్లులు రాక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కార్మికులను ఇబ్బంది పెడుతూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. కావున వెంటనే కార్మికులకు ప్రతినెల బిల్లులను విడుదల చేయాలన్నారు.