శనివారం హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్ అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలోని ప్రతి విభాగాన్ని అంచలంచలుగా అభివృద్ధి చేస్తామని, రోగులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రోగులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనిచేయని సిబ్బందిని తొలగించి కొత్తవారిని నియమించాలన్నారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ అవసరాన్ని బట్టి కొత్త నియామకాలు చేపట్టాలని తెలిపారు