తెనాలిలో సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన అశోక్ కొన్నేళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఇక్కడే ఉంటున్నాడు. ఇదేకాక స్థానికంగా ఉండే 14 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమించాను, ఆమెతో పెళ్లి చేయాలంటూ మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కాడు. 3 గంటల హైడ్రామా అనంతరం కిందికి దిగివచ్చిన అతడికి స్థానికులు సోమవారం దేహశుద్ధి చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.