వినాయకుని మండపాల వద్ద కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని చెరుకుపల్లి ఎస్ఐ అనిల్ కుమార్ సూచించారు. ఆయన బుధవారం మాట్లాడుతూ మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, రాత్రి, పగలు కమిటీ సభ్యులు ఒక్కరైనా మండపం వద్ద ఉండాలని తెలిపారు. గొడవలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని, మద్యం సేవించి మండపాల వద్ద గొడవలు జరిగితే కమిటీ సభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎలాంటి ఘర్షన్లో చోటు చేసుకోకుండా పండగను విజయవంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు.