మోటో క్రిప్టో కరెన్సీ లో ప్రజలను మోసం చేసిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్ కు సంబంధించిన వివరాలను రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి శనివారం మీడియాకు వివరించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. బ్యాంక్ అకౌంటు, పాన్ కార్డు, రెండు మొబైల్ ఫోన్ , ఒక ట్యాబ్ ను స్వాధీనం చేసుకున్నామని, ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.