కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని,మహమూద్ పట్నం లో శుక్రవారం నమ్మదగిన సమాచారం మేరకు,డీ ఎఫ్ ఎస్ ఓ అధికారులు దాడులు నిర్వహించి, వీరాంజనేయ బిన్నీ రైస్ మిల్లులో 14 సంచులలో, దాదాపు 15 క్వింటాల పిడిఎస్ బియ్యంను డి ఎఫ్ ఎస్ ఓ ప్రేమ్ కుమార్ పట్టుకున్నారు. మిల్లు యజమానిని విచారించగా బియ్యాన్ని నూకలుగా చేసి ఒక కిలో 12 రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిపారు.అయితే ఇందులో పిడిఎస్ బియ్యం సీలుతో ఉన్న బస్తాలు ఉండడంతో ,డీ ఎఫ్ ఎస్ ఓ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.ఇలాంటి చర్యలకు,అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లుల యజమాన్యం పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.