గుత్తిలోని ఓల్డ్ సీపీఐ కాలనీకి చెందిన నరసింహ, నిఖిల్, లక్కీ అనే ముగ్గురు చిన్నారులు రెండు రోజులు కష్టపడి మట్టి వినాయకుని రూపొందించారు. మంగళవారం వినాయకుని పూర్తిస్థాయిలో తయారు చేశారు.ఒక్క పైసా ఖర్చు లేకుండా మూడున్నర అడుగుల వినాయకుని తయారు చేశారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగని మట్టి వినాయకుని రూపొందించారు. చెరువులో నుంచి మట్టిని తెచ్చి గణనాధుని తయారు చేసినట్లు చిన్నారులు చెప్పారు. ఎంతో చూడముచ్చటగా ఉన్న వినాయకుని జనాలు వీక్షిస్తున్నారు.