బొండపల్లి మండలం కనిమెరక గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రైలు ప్రమాదంలో దత్తి రాజేరు మండలం వింధ్యవాసి గ్రామానికి చెందిన శంకర్రావు మృతి మృతి చెందాడు. కనిమేరక గిట్టుపల్లి రైల్వే ట్రాక్ మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండడానికి స్థానికులు గుర్తించి బొబ్బిలి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతులు వింధ్యవాసి గ్రామానికి చెందిన శంకర్ రావు గా గుర్తించారు. రైలు ఢీకొట్టడం వలన గాని మరి ఏదైనా కారణం శంకర్రావు మృతి చెంది ఉండవచ్చని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.