ప్రభుత్వ పెన్షన్లు పునఃపరిశీలన ప్రక్రియలో భాగంగా పలువురి పెన్షన్లను తగ్గించడం లేదా పూర్తిగా నిలిపివేయడంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్‌ను రూ. 15,000 నుంచి రూ. 6,000కు భారీగా తగ్గించిందని శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండల పరిషత్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, "ఎన్టీఆర్ భరోసా" పథకం కింద వికలాంగులకు కేటగిరీల వారీగా పెన్షన్లు అందజేస్తున్నారు.సాధారణ వికలాంగులు (40% - 79% వైకల్యం) వీరికి నెలకు రూ. 6,000 పెన్షన్ అందించబడుతుంది. తీవ్రమైన వైకల్యం కలవారు (80% ఆపైన): చక్రాల కుర్చీకే పరిమితమైన వారు, తీవ్ర