అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం గ్రామంలో వెలసిన నెట్టికంటి ఆంజనేయస్వామిని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ దర్శించుకున్నారు. శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే తన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి, కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే, కుటుంబసభ్యులను అర్చకులు వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.