రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ సిద్ధి వినాయక ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల 10వ, రోజున భక్తుల శ్రద్ధాభక్తులతో నవగ్రహ ఆవాహన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నవగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలను పొందారు.