మడకశిర మండలంలోని రంగాపురం గ్రామంలో మూడు రోజుల క్రితం భూ తగాదాల విషయంలో వృద్ధురాలిపై కొంతమంది దాడి చేశారు. వృద్ధురాలని రక్షించడానికి వెళ్లిన వైకాపా నాయకుడు సికిందర్ పై వారు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. స్థానికులు సికిందర్ ను మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.గురువారం వైసీపీ ఇన్చార్జి ఈర లక్కప్ప ఆస్పత్రికి వెళ్లి సికిందర్ ను పరామర్శించారు.సికిందర్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.