కాకినాడ జిల్లా సామర్లకోట లైన్స్ క్లబ్ భవనం నందు, లైన్స్ క్లబ్ ఆఫ్ భీమేశ్వర ఆధ్వర్యంలో, సామర్లకోట ప్రభుత్వ పాఠశాలలో,ఉపాధ్యాయునిగా పనిచేస్తూ జిల్లాస్థాయి,ఉత్తమఉపాధ్యాయునిగా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు పొందిన దేవగుప్త వీరన్న, ఇతర ప్రైవేట్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను, ఘనంగా సత్కరించి సన్మానించారు.ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే గురుపూజోత్సవంలో,ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను గౌరవించడం జరుగుతుందని, ఇకనుండి ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి,సన్మానించడం జరుగుతుందన్నారు.