యూరియా పంపిణీలో ఓటీపీ విధానాన్ని తొలగించి జిరాక్స్ పత్రాలను తీసుకొని టోకెన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ నంగునూరు మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద సోమవారం రైతులు రోడ్డు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సుమారు అరగంట పాటు రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ మేరకు రైతులు ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు తన ఇష్టానుసారంగా యూరియాను పంపిణీ చేస్తుందని, కొందరికి మాత్రమే టోకెన్లు ఇచ్చి, మిగిలిన యూరియా బస్తాలను పక్కదారిన అమ్ముకుంటున్నారని ఆరోపించారు.