మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు మరింత చేరువయ్యాయని బిజెపి జిల్లా కార్యదర్శి మహాలక్ష్మి అన్నారు. శుక్రవారం ఉదయం ఏటూరునాగారంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆమె మాట్లాడుతూ.. కేంద్రం వ్యవసాయ, ఎలక్ట్రానిక్, వైద్య, విద్య, రంగంలో వివిధ వస్తువులకు జీఎస్టీ భారాన్ని తగ్గించడం జరిగిందన్నారు. దీంతో మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గిందన్నారు. చక్రవర్తి, సత్యం, రాకేష్ జనార్ధన్ పాల్గొన్నారు.