గురువారం పరకాల పట్టణ కేంద్రంలోని దామెర చెరువు వద్ద జరుగనున్న సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అవసరమైన అన్ని సౌకర్యాలను సమయానికి అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఉత్సవం కావున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు