ప్రజా ప్రభుత్వంలో ప్రజలు కోరుకున్న పనులు చేస్తున్నాం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.గురువారం వేములవాడ పట్టణంలో 15 వార్డు లాలనగర్ బాలానగర్,తిప్పాపూర్ లో పలు కుల సంఘ భవనాల నిర్మాణనికి స్పెషల్ డేవలెప్మెంట్ ఫండ్స్ నుండి మంజూరు కాబడిన ప్రొసీడింగ్ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు..బాలానగర్ లో నూతన ట్రాన్స్ఫార్మర్స్ ప్రారంభించి,రెడ్డి కమ్యూనిటి హాల్ తో పాటు పలు కమ్యూనిటి హల్ నిర్మాణనికి భూమి పూజ నిర్వహించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతినిత్యం అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకు పోతుందని చెప్పారు.