మడకశిర కు చెందిన వైకాపా నాయకులు కార్యకర్తలు మంగళవారం అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొన్నారు. పెనుకొండ ఆర్ డి ఓ కార్యాలయం వద్దకు చేరుకొని బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.రైతులకు యూరియాను వెంటనే అందించాలని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైసిపి ఇన్చార్జి లక్కప్ప మడకశిర నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఆర్టీవో కార్యాలయంలోకి వినతి పత్రం ఇవ్వడానికి వెళుతుండగా పోలీసులు నాయకులు మధ్య తోపులాట జరిగింది.