సెప్టెంబర్ 11 అడవి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా అడవి శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుండి లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని సెంట్రల్ పార్క్ వరకు గురువారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించిన అడవి శాఖ సిబ్బంది... కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన డిఎఫ్ఓ కృష్ణ గౌడ్... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులను కాపాడటం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను మరవద్దని సిబ్బందికి సూచించారు.. అమరులైన అడవిశాఖ అధికారుల ఆశయాలకు అనుగుణంగా అడవి శాఖ సిబ్బంది పనిచేయాలని తెలిపారు...