ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రామగిరి మండల కేంద్రంలో శుక్రవారం స్వర్గీయ నందమూరి తారకరామారావు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ రాప్తాడుఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యకర్తల ఉద్దేశించి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ జిల్లాలో పరిటాల రవీంద్రను ఎవరు మర్చిపోలేరని రేపు పెనుగొండలో సైతం పరిటాల రవీంద్ర కామసా విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.