అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కర్నూలు జాయింట్ కమీషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసులో ఏఓ గా పని చేస్తున్న మూడే బాలు నాయక్ ఏసిబి అధికారులకు శుక్రవారం పట్టుబడ్డాడు. మదనపల్లి రవీంద్ర నగర్ లో ఉన్న బాలునాయక్ కొడుకు, వాళ్ల మామ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అడిషనల్ ఎస్పీ విజయ కుమారి తెలిపారు. ఈ దాడులు ఎసిబీ సీఐ హమీద్ ఖాన్ సిబ్బందితో ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.