సత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో శుక్రవారం ఐదున్నర గంటల సమయంలో ధర్మవరం నియోజవర్గం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ రక్తదాన శిబిరాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ పరిటాల రవీంద్ర 67వ జయంతి సందర్భంగా పరిటాల రవీంద్ర అభిమానులు టిడిపి నేతలతో కలిసి మెగా రక్తదాన శిబిరంలో 1000 యూనిట్ల రక్తాన్ని సేకరించి స్వచ్ఛంద సంస్థలకు అందివ్వడం జరిగిందని రానున్న రోజుల్లో కూడా పరిటాల రవీంద్ర చూపిన సేవా మార్గంలోనే తాము మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.