అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని ప్రభుత్వ రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ ఫర్టిలైజర్స్ దుకాణాల్లోనూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే ఎరువులను విక్రయించాలి అని బెలుగుప్ప మండల తహసీల్దార్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం వ్యవసాయ అధికారి పృథ్వి సాగర్ తో కలసి బెలుగుప్ప, గుండ్లపల్లి గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలను, దుకాణాలకు సంబంధించిన గోదాముల్లోనూ ఆకస్మిక తనిఖీలను తహసిల్దార్ నిర్వహించారు. ధరల అమ్మకాలు స్టాక్ రిజిస్టర్ ల తేడాలు ఉన్నట్లయితే కఠిన చర్యలు తప్పవని డీలర్లకు తహసీల్దార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విఆర్వోలు రాజశేఖర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.