ఎమ్మిగనూరులో ట్రాన్స్ జెండర్ల ధర్నా..ఎమ్మిగనూరు తహశీల్దార్ కార్యాలయం ముందు ట్రాన్స్ జెండర్లు గురువారం ధర్నా చేపట్టారు.సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ శేషఫణికి సమర్పించారు. ట్రాన్స్ జెండర్స్ సింధు, గౌరీకళ మాట్లాడుతూ.. ఎమ్మిగనూరులో నివసిస్తున్న తమ అందరికీ వ్యక్తిగత రేషన్ కార్డులు లేవని, ఫ్యామిలీ కార్డుల నుంచి తొలగించి కొత్త రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.