గంజాయి వద్దు, చదువే ముద్దు అంటూ గూడెం కొత్తవీధి మండలంలోని ధారకొండలో శనివారం ధారకొండ, అమ్మవారి ధారకొండ, సీలేరు, గుమ్మిరేవుల, గాలికొండ పంచాయతీలకు చెందిన పలు గ్రామాలకు చెందిన గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. గూడెం కొత్తవీధి సీఐ వర ప్రసాద్, ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో సీఐ మాట్లాడుతూ, గంజాయి సాగు, రవాణా చేయడం చట్టరీత్యా పెద్ద నేరమని చెప్పారు. గంజాయి వల్ల జీవితాలు నాశనమవుతాయన్నారు. గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి వల్ల శారీరక, మానసిక అనారోగ్యం కలుగుతుందన్నారు.