శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం కొత్త చామల పల్లి గ్రామంలో రోడ్డు ప్రక్కన నీటి సరఫరా పైపు పగిలిపోవడం వల్ల తాగునీరు కలుషితమవుతుందని ఎన్నిసార్లు తెలిపిన పంచాయతీఅధికారులు పట్టించుకోవట్లేదు అని అపరిశుభ్రమైన నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్తులు వాపోయారు ఇప్పటికైనా పంచాయితీ అధికారులు స్పందించి నీటి పైపులైను బాగు చేయాలని కోరారు